పులివెందులలో జగన్ కు చెక్. చంద్రబాబు వ్యూహం ఇదేనా?

చంద్రబాబు రాజకీయమంతా విడదీసి.. పాలించటమే సిద్దాంతం ప్రకారమే జరుగుతుంది. ఎవరైనా గ్రూపుగా చేరి ఉద్యమానికి దిగితే వెంటనే దాన్ని రెండుగా విడతీసి బలహీనపరుస్తాడు. అప్పట్లో ఎస్సీల దగ్గర్నుంచి ఇప్పుటి కాపు ఉద్యమం వరకూ అన్నీ చూస్తూనే ఉన్నాం. అదే పాలసీని తాజాగా నియోజకవర్గాల్లోనూ అవలంభించాలని చంద్రబాబు ప్లాన్ వేశారు. ప్రస్తుతం ఆయన దృష్టంతా నియోజకవర్గాల పెంపుపైనే ఉందన్న సంగతి తెలిసిందే.

డీలిమిటేషన్ జరిగి ఏపీలోని 175 నియోజకవర్గాలు కాస్తా 225 అవుతాయంటూ ఇప్పటిదాకా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు చెప్పి వారిని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నించాడు. అందులో కొంత సక్సెస్ కూడా సాధించాడు. కానీ ఆ డిమిలిటేషన్ వ్యవహారం మాత్రం ఒక కొలిక్కి వచ్చే అవకాశమైతే కన్పించటంలేదు. ఒకవేళ ఏదో అద్భుతం జరిగి డీలిమిటేషన్ జరిగితే తొలుత పులివెందులను చీల్చిపారేయాలనేది బాబు వ్యూహం. ఎందుకంటే పులివెందుల వైయస్ కుటుంబానికి పెట్టని కోటలాంటిది. అక్కడ వారి గెలుపు గురించి మాట్లాడటానికేమీలేదు. అందుకే బాబు ఫస్ట్ పులివెందులను చీల్చి పక్క నియోజకవర్గాల్లో కలపటం ద్వారా జగన్ కు చెక్ చెప్పాలని స్కెచ్ గీశారు. ఆ నియోజకవర్గంలో సింహాద్రిపురం మండలం వైసీపీకి కంచుకోట.

దీన్ని పక్క నియోజకవర్గంలోకి కలిపేసి లింగాలను సగం,సగం చేయాలని చూస్తున్నాడట. ఈ రెండు మండలాలు కాకవికలమైతే టీడీపీకి పట్టున్న చక్రాయపేట, తొండూరు, వేముల మండలాల బలంతో జగన్ను తేలిగ్గా ఓడించవచ్చని, కనీసం మెజార్టీనైనా భారీగా తగ్గించవచ్చన్నది బాబు వ్యూహం. ఇందుకోసం ప్లానంతా రడీ అయింది. కాకపోతే డీలిమిటేషన్ అనే దానిపైనే క్లారిటీ లేకపోతే బాబు స్కెచ్ ప్రస్తుతానికి అటకమీద పెట్టారు.